- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధరల స్థిరీకరణపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు
సచివాలయంలో ధరల స్థిరీకరణపై మంత్రివర్గ ఉపసంఘం ప్రాధాన్యత కలిగిన సమావేశాన్ని నిర్వహించింది...

దిశ, వెబ్ డెస్క్: సచివాలయం(Secretariat)లో ధరల స్థిరీకరణపై మంత్రివర్గ ఉపసంఘం(Cabinet Subcommittee) ప్రాధాన్యత కలిగిన సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీకి రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu), పయ్యావుల కేశవ్(Payyavula Keshav) హాజరయ్యారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచేందుకు, బహిరంగ మార్కెట్ సరళీకృత ధరలపై నిరంతర నిఘా ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై చర్చ
రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రులు సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రాధాన్యత కలిగిన వరి రకాల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, దీనివల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయని కమిటీ స్పష్టం చేసింది.
యుద్ధాల ప్రభావం వల్ల..
అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాల ప్రభావం వల్ల కొన్ని వస్తువుల ధరలు పెరిగినప్పటికీ, వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రిటైల్, హోల్‌సేల్ మార్కెట్ ధరలను సబ్ కమిటీ నిరంతరం సమీక్షిస్తుందని, ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లోనే లభించేలా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.






