టీడీపీ-జనసేన పొత్తుకు కారణమిదే.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   (  Updated:2024-02-24 08:26:18  IST  )

అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ-జనసేన కూటమి దూకుడు పెంచింది.

టీడీపీ-జనసేన పొత్తుకు కారణమిదే.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ-జనసేన కూటమి దూకుడు పెంచింది. శనివారం తొలి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి విడుదల చేశారు. 94 స్థానాలపై టీడీపీ, 24 స్థానాలపై జనసేన పోటీ చేయనున్నట్లు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అయితే మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని అభివృద్ధి బాటలో నడిపించాలని.. రాష్ట్ర బంగార భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన అలయెన్స్ ఏర్పడిందన్నారు. తమ పొత్తుకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయన్నారు. వైసీపీ విముక్త ఏపీ లక్ష్యంగా కలిసి పని చేస్తామన్నారు. అనంతరం పవన్ ఐదుగురు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మిగతా 19 స్థానాలకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తామన్నారు.

Read More..

40 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన

Next Story