చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్‌పై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్‌పై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాని మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చాడని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసి ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రానికి లొంగి పనిచేశారని కీలక ఆరోపణలు చేశారు. స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లి సాయం కోరేవారని గుర్తుచేశారు. స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లిన కారణంగా ఆంధ్రప్రదేశ్ పేదరాష్ట్రం అంటే ఎలా నమ్ముతామని పీఎం సెక్రటరీ అనేవారని చెప్పారు. కాగా, ఇటీవల కేశినేని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

దీంతో వైసీపీ అధిష్టానం నానికి విజయవాడ పార్లమెంట్‌ టికెట్‌ను కేటాయించింది. మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. వైసీపీ సిద్ధం అంటూ, టీడీపీ సంసిద్ధం అంటూ, జనసేన మేమూ సిద్ధమే అనే నినాదాలతో రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు- ప్రతివిమర్శలు సెగలు రేపుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని.. చంద్రబాబు విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు.

Next Story

Most Viewed