- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై నేతల కీలక వ్యాఖ్యలు
ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో దాడులు చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్న నాయకులు.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Prasadam) తయారీలో వాడే నెయ్యి కల్తీ (Adulteration Of Ghee) అయిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెను తుఫాను సృష్టిస్తోంది. సుప్రీంకోర్టు (Supreme Court) పర్యవేక్షణలో సాగిన సిట్ (SIT) దర్యాప్తు నివేదిక బయటకు వచ్చిన తర్వాత, అధికార కూటమి పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ (YCP) నేతల మధ్య విమర్శల పర్వం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ (Bhole Baba OrganiC Dairy) సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ కావడంతో, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో తేల్చాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. పరస్పరం మాటల బాణాలను వదులుతూ యుద్ధానికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో దాడులు చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల రణరంగమే జరుగుతుందనడంలో ఆశ్చర్యం లేదు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) ఈ అంశంపై ఘాటుగానే స్పందించారు. నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా సంస్థ వెనుకున్న అసలు 'ఆలీబాబా' (Ali Baba) ఎవరో బహిర్గతం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వం భక్తుల మనోభావాలతో ఆడుకుందని, కల్తీ నెయ్యి సరఫరాను అడ్డుకోవడంలో విఫలమైందని మంత్రి ఆరోపించారు. పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ కుంభకోణంలో పెద్దల పాత్రపై లోతైన విచారణ జరగాలని మంత్రి స్పష్టం చేశారు.
దీనికి ప్రతిగా టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఎదురుదాడికి దిగారు. భోలే బాబా కంపెనీకి సంబంధించిన అనుమతులు, ఆ సంస్థ ప్రస్తావన చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) హయాంలోనే మొదలైందని ఆయన గుర్తు చేశారు. మంత్రి సత్యకుమార్ వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన తిరుమలను వివాదాల్లోకి లాగడం సరికాదని, వైసీపీ హయాంలో తాము భక్తిశ్రద్ధలతోనే వ్యవహరించామని ఆయన సమర్థించుకున్నారు.
మరోవైపు మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) సైతం వైకాపా తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గత ఐదేళ్ల పాలనలో టీటీడీ (TTD) పవిత్రతను పూర్తిగా దెబ్బతీశారని విమర్శలను గుప్పించారు. సిట్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. కేవలం తిరుమల (Tirumala) మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పవిత్రతను కాపాడడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ప్రకటించారు. సిట్ నివేదిక ఆధారంగా దోషులందరిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మొత్తానికి తిరుమల నెయ్యి వ్యవహారం రాజకీయ రంగు పులుముకుని ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య నలుగుతోంది. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీటులో 36 మందిని నిందితులుగా చేర్చడం, తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేసేలా నిబంధనలు సవరించడం వంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భక్తుల విశ్వాసానికి సంబంధించిన ఈ సున్నితమైన అంశంపై తుది విచారణలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






