- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాశీబుగ్గ ఆలయం ప్రైవేటు వ్యక్తులది.. ఏపీ దేవాదాయశాఖ కీలక ప్రకటన
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఏపీ దేవాదాయశాఖ వివరణ ఇచ్చింది. ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదని స్పష్టం చేసింది. ఆలయ కెపాసిటీ కేవలం 5వేలు మాత్రమేనని కానీ 25వేల మంది భక్తులు వచ్చారని తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఏపీ దేవాదాయశాఖ వివరణ ఇచ్చింది. ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదని స్పష్టం చేసింది. ఆలయ కెపాసిటీ కేవలం 5వేలు మాత్రమేనని కానీ 25వేల మంది భక్తులు వచ్చారని తెలిపింది. గతేడాదే గుడిని నిర్మించగా గుడి కట్టిన తరవాత ఇదే తొలి కార్తీకమాసం అని పేర్కొంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ప్రభుత్వానికి నిర్వాహకులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపింది. నిర్వాహకుల వైఫల్యమే ఘటనకు కారణం అని ఆరోపించింది.
ఇదిలా ఉంటే ఈ ఘటనలో పది మంది మరణించారు. మరణించినవారిలో ఓ బాలుడు ఉన్నాడు. రెయిలింగ్ ఊడిపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఆలయాన్ని పండా అనే భక్తుడు ఐదెకరా భూమిలో రూ.10 కోట్లతో నిర్మించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించగా మంత్రి అచ్చెన్నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే గౌతు శిరీష, సీదిరి అప్పలరాజు సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.






