ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల ప్రయోజనం ఏంటి?.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఏపీ ప్రభుత్వం(NDA Govt)పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల ప్రయోజనం ఏంటి?.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం(NDA Govt)పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం(Free Bus scheme) వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ.. ఉచితాలు అలవాటు చేయకూడదని అన్నారు. విద్యతో మాత్రమే పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వైద్యం ప్రతీ మనిషికి అవసరమైందని గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాలని సూచించారు. ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు.. ఎంత తిరిగి చెల్లిస్తున్నారన్నది ప్రకటించాలని అన్నారు. అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెరవేయాలని సూచించారు. సభలో లేనివారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదని హితవు పలికారు.

ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యంపై దృష్టి సారించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉచితాలు ఇవ్వడం సరికాదని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, చట్టబద్ధతకు ఆయన పలు సూచనలు చేశారు. 'చేపలు పట్టడం నేర్పించాలి కానీ.. చేపలు తీసుకొచ్చి ఉచితంగా ఇవ్వకూడదు' అంటూ వ్యాఖ్యనించారు. ఉచితాలు అనుచితంగా తయారయ్యాయని.. పరిమితుల దాటాయన్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉచిత పథకాలను అమలు చేయడం అలవాటుగా మారిందన్నారు. ఈ ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ప్రమాదంలో పడిందని.. ప్రభుత్వాలు పరిమితికి మంచి అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. వీడియో

Next Story