దక్షిణ మధ్య రైల్వేలో కీలక మార్పులు: డివిజన్ల సంఖ్య 6 నుంచి 3కి తగ్గింపు

by Vemula.Srinu Prasad |

దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో ఒకేసారి సగానికి సగం డివిజన్లు తగ్గిపోతున్నాయి. ఇప్పటివరకు ఆరు డివిజన్లతో భారీ నెట్‌వర్క్‌గా ఉన్న ఈ జోన్.. రాబోయే జూన్ 1వ తేదీ నుంచి కేవలం మూడు డివిజన్లకే పరిమితం కానుంది..

దక్షిణ మధ్య రైల్వేలో కీలక మార్పులు: డివిజన్ల సంఖ్య 6 నుంచి 3కి తగ్గింపు
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో ఒకేసారి సగానికి సగం డివిజన్లు తగ్గిపోతున్నాయి. ఇప్పటివరకు ఆరు డివిజన్లతో భారీ నెట్‌వర్క్‌గా ఉన్న ఈ జోన్.. రాబోయే జూన్ 1వ తేదీ నుంచి కేవలం మూడు డివిజన్లకే పరిమితం కానుంది. పరిపాలనా సౌలభ్యం, కొత్త జోన్ ఏర్పాటు నేపథ్యంలో రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రాల్లో విస్తరించిన ఈ జోన్ స్వరూపం పూర్తిగా మారిపోనుంది.

కొత్త సౌత్ కోస్ట్ జోన్‌లోకి ఏపీ డివిజన్లు!

ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా కొత్త 'దక్షిణ కోస్తా రైల్వే జోన్' (South Coast Railway Zone) అందుబాటులోకి వస్తోంది. ఈ కొత్త జోన్ ఏర్పాటు వల్ల ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న కీలకమైన విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్లు అందులోకి బదిలీ కానున్నాయి. ఫలితంగా ఈ మూడు డివిజన్లు జూన్ 1 నుంచి కొత్త జోన్ పరిధిలో తమ సేవలను అందించనున్నాయి.

తెలంగాణ, మహారాష్ట్ర పరిధికే పరిమితం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడు డివిజన్లు విడిపోవడంతో.. ఇకపై దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే మిగులుతాయి. ఈ మార్పుతో దక్షిణ మధ్య రైల్వే ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం కానుంది. ఈ విభజన ప్రక్రియకు సంబంధించి రైల్వే ఉన్నతాధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Next Story