చేతనైతే వాటిని వెనక్కి తీసుకురా.. జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి సవాల్

by Ajay Maddhiboyina |

టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. రాయలసీమ నాయకుడిగా ఈ ప్రాంత సమస్యలపై చంద్రబాబుతో మాట్లాడాలని డిమాండ్ చేశారు.

చేతనైతే వాటిని వెనక్కి తీసుకురా.. జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి సవాల్
X

దిశ‌, వెబ్ డెస్క్: టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. రాయలసీమ నాయకుడిగా ఈ ప్రాంత సమస్యలపై చంద్రబాబుతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని, అనంతపురానికి ఎయిమ్స్, కడపకు స్టీల్ ప్లాంట్, కర్నూలు నుండి తీసేసిన హైకోర్టును సాధించాలని సవాల్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని దాని కోసం ఎంతవరకు అయినా కొట్లాడతానని చెప్పారు. ప్రభాకర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డితో వెళ్లి మాట్లాడాలని అన్నారు.

రేవంత్ స్వయంగా చంద్రబాబుతో మాట్లాడి లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపించానని అసెంబ్లీలోనే చెప్పాడన్నారు. ఇదే అన్యాయం వేరే ప్రాంతానికి జరిగితే ఊరుకునేవాళ్లా అని ప్రశ్నించారు. ఇది భవిష్యత్ తరాలకు జరిగే అన్యాయం అని చెప్పారు. మీరు కాకుండా మీ అన్న రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండి ఉంటే ఖచ్చితంగా రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడేవాళ్లని అన్నారు. గెలుపు ఓటములు సహజం అని రాయలసీమ గురించి ఖచ్చితంగా మాట్లాడతానని అన్నారు. గెలుపు ఓటములు చూసి విర్రవీగమని అన్నారు. అభివృద్ధి ఎవ‌రు చేసినా స్వాగ‌తిస్తామ‌ని రాయ‌ల‌సీమ ప్రాంతానికి నిధులు తీసుకురావాల‌న్నారు. రాయ‌ల‌సీమ‌లో ఉన్న ప్ర‌తిఒక్క‌రూ దీని గురించి కొట్లాడాల‌న్నారు.

Next Story