- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kesineni: కేసిరెడ్డితో కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామి?.. ఇవిగో ఆధారాలు అంటూ నాని సంచలన పోస్టు
బెజవాడలో అన్నదమ్ముల వార్పతాక స్థాయికి చేరింది.

మద్యం కుంభకోణం నిందితుడితో టీడీపీ ఎంపీ వ్యాపారాలు!
తమ్ముడిపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన కేశినేని నాని
స్వంతంత్ర దర్యాప్తు చేయించండంటూ చంద్రబాబుకు లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో : బెజవాడలో అన్నదమ్ముల వార్పతాక స్థాయికి చేరింది. సిట్టింగ్ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) (Kesineni Chinni), అన్న కేశినేని నాని (Kesineni Nani) మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటికి మొన్న అన్న నానిపై తమ్ముడు చిన్ని పరువు నష్టం దావా వేస్తానంటూ నోటీసు పంపించారు. తాజాగా ఈ రోజు కేశినేని నాని ట్విట్టర్లో ఒక సంచలన పోస్టు చేశారు. మరోసారి చంద్రబాబు నాయుడికి (Chandrababu) లేఖ రాశారు. ఏపీ మద్యం కుంభకోణంలో (Liquor Scam) అరెస్టు అయిన వ్యక్తులతో, ముఖ్యంగా కేసిరెడ్డి (Kesireddy) రాజశేఖరరెడ్డి, దిలీప్పైలాతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)కి సంబంధం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. కేసిరెడ్డి, ఎంపీ కేశినేని చిన్నితో అతని భార్యతో కలిసి ప్రైడ్ఇన్ఫ్రాకాన్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కంపెనీ హైదరాబాద్లో ఉందంటూ అడ్రసు కూడా తెలిపారు. కేసిరెడ్డి, దిలీప్పైలా నిర్వహిస్తున ఏషన్వి ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్కూడ ఇదే చిరునామా కలిగి ఉందన్నారు. పై రెండు కంపెనీలు ఒకే అధికారిక ఈ మెయిల్ఐడీలు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మద్యం కేసులో నిందితులు ఒక సిట్టింగ్ఎంపీతో నేరుగా సంబంధాలు కలిగి ఉండడం ఆందోళన కలిగించే విషయం అన్నారు. చిన్ని పెద్ద ఎత్తున నిధులు అక్రమ మార్గంలో మళ్లించి విదేశాలకు తరలించారని ఆరోపించారు. వెంటనే జోక్యం చేసుకుని స్వతంత్ర ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని చంద్రబాబును కోరారు. న్యాయాన్ని నిలబెట్టాలని ఆయన విన్నవించారు.
https://x.com/kesineni_nani/status/1919208250068947327






