- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ మా ఇంటికొచ్చి మరీ రిక్వెస్ట్ చేశారు.. కర్ణాటక CM ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కృషి ఫలించింది. ఏపీకి ఆరు కుంకీ ఏనుగులను (Kumki Elephants) కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కృషి ఫలించింది. ఏపీకి ఆరు కుంకీ ఏనుగులను (Kumki Elephants) కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కుంకీ ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్‌కు సిద్ధరామయ్య అందజేశారు. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఆంధ్రా వాళ్ల శిక్షణ కోసమే ఏనుగులను పంపిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన ఏనుగులు అత్యధికంగా కర్ణాటకలోనే ఉన్నాయన్నారు. ఆంధ్రాతో పాటు అడిగిన అన్ని రాష్ట్రాలకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది పవన్ కల్యాణ్ మా ఇంటికి వచ్చి మరీ కుంకీ ఏనుగులు కావాలని రిక్వెస్ట్ చేశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఏనుగులు అప్పగించామని అన్నారు. అంతకుముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తోందన్నారు. ఏపీ, కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు.
➡️ఆంధ్రా వాళ్ల శిక్షణ కోసమే ఏనుగులను పంపిస్తున్నాం
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) May 21, 2025
➡️శిక్షణ పొందిన ఏనుగులు అత్యధిక కర్ణాటక లొనే ఉన్నాయి
➡️అడిగిన అన్ని రాష్ట్రాలకు సహాయం చేస్తున్నాం
ఆంధ్రా ఒక్క రాష్ట్రానికే కాదు
➡️గత ఏడాది మా ఇంటికి వచ్చి కుంకి ఏనుగులు కావాలని పవన్ కుమార్ విజ్ఞప్తి చేశారు
- సీఎం సిద్ధరామయ్య… pic.twitter.com/uBTgXjddte






