1592 పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ.. ప్రభుత్వ ఆదేశాలు

by Malleboina Mahesh |

బాలికలలు తమను తాము రక్షించుకునే విధంగా తీర్చిదిద్దేందుకు.. రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమం చేపట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా 1592 పాఠశాలల్లో బాలికలకు కరాటే నేర్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

1592 పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ.. ప్రభుత్వ ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాలికలలు తమను తాము రక్షించుకునే విధంగా తీర్చిదిద్దేందుకు.. రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమం చేపట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా 1592 పాఠశాలల్లో బాలికలకు కరాటే నేర్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న బాలికలకు నిపుణులతో కూడిన ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో కరాటే పై రెండు నెలల పాటు 20 తరగతులను నిర్వహిస్తారు. ప్రతి తరగతి 90 నిమిషాల పాటు ఉంటుందని సమగ్ర శిక్షా అభియాన్ తెలిపింది. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని సమగ్ర శిక్షా అభియాన్ పేర్కొంది. ఈ నిర్ణయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వెల్ఫేర్ సెక్రటరీలకే ఎడ్యుకేషన్ బాధ్యతలు

వార్డు సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శులే ఇక ఎడ్యుకేషన్ బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చేసిన సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంతో న్యాయ శాఖ గురువారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శుల నుంచి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ను తొలగించి సంక్షేమ కార్యదర్శులకు బదలాయిస్తూ చేసిన చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై వార్డు సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శులే ఇక ఎడ్యుకేషన్ బాధ్యతలను కూడా చూసుకోనున్నారు.

Next Story