- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాయత్రిదేవిగా కనకదుర్గమ్మ.. బ్రహ్మచారిణిగా భ్రమరాంబికా దేవి
ఏపీలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై (Indrakiladri) కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు రెండవరోజు భక్తులకు గాయత్రీదేవి (Gayatri Devi) అలంకరణలో దర్శనమిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై (Indrakiladri) కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు రెండవరోజు భక్తులకు గాయత్రీదేవి (Gayatri Devi) అలంకరణలో దర్శనమిస్తున్నారు. మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత మంగళవారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు అందుకున్నారు. అలాగే.. పరిటాల సునీత, ఎమ్మెల్యే యార్లగడ్డ, సింధూరారెడ్డిలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు.
మరోవైపు శ్రీశైలంలో (Srisailam) శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో దసరా శరన్నరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తొలిరోజు శైలపుత్రి అలంకరణలో దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి.. రెండోరోజు బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు మయూర వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు.






