కులమత భేదాల గోడల్ని చెరిపేసిన భక్తి యోధుడు కనకదాస

by Thanuru Gopichand |

భక్త కనకదాస (Kanakadasa) జయంతిని పురస్కరించుకొని ఆయన గొప్పతనాన్ని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ (YS Jagan) స్మరించుకున్నారు.

కులమత భేదాల గోడల్ని చెరిపేసిన భక్తి యోధుడు కనకదాస
X

దిశ, వెబ్ డెస్క్ : భక్త కనకదాస (Kanakadasa) జయంతిని పురస్కరించుకొని ఆయన గొప్పతనాన్ని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ (YS Jagan) స్మరించుకున్నారు. ట్విట్టర్ వేదికగా భక్త కనకదాసకు నివాళులు అర్పించారు. కులమత భేదాల గోడల్ని చెరిపేసిన భక్తి యోధుడు, శ్రీకృష్ణ భగవానుడికి (Bhagawan Sri Krishna) గొప్ప భక్తుడు శ్రీ భక్త కనకదాస అన్నారు. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు ఆయన అని కొనియాడారు. ఎన్నో భక్తి కీర్తనలతో క‌విత్వానికి కొత్త ఊపిరి పోశారన్నారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచిన భక్త కనకదాస జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు.

భక్త కనకదాసు

మీలో మోక్షానికి ఎవరు అర్హులు ? అని శిష్యులను గురువు వ్యాసరాయలవారు ప్రశ్నిస్తే.. నేనే అర్హుడిని అని ధైర్యంగా చెప్పిన కురుబ గౌడ దాస కుటుంబంలో పుట్టిన మహా భక్తుడు కనకదాసు. కర్ణాటకలోని హవేరీ జిల్లా బాద గ్రామంలో బీర్ గౌడ, బీచమ్మ దంపతులకు 1509 కనకదాస జన్మించారు. తనకీర్తనలు, ఉపభోగాల వలన కర్ణాటక సాహిత్యాన్ని సుసంపన్నం చేసి బాగాప్రసిద్ధమయ్యారు.

కనక మందిరం

మహాభక్తుడైన కనకదాస ఉడిపి (Udipi) ఆలయ గోపురం ముందు చిన్న గుడిసెలో ఉండేవారు. తర్వాత దాన్ని ఒకమందిరం లాగా కట్టి కనక మందిరం (Kanaka Mandira) అని పిలుస్తున్నారు. మహా భక్తుడైన పురందర దాసు వ్యాసరాయలూ కృష్ణ భక్తులే అయినా కనక దాసుకూ కృష్ణ స్వామికి ఉన్న అనుబంధం అన్నిటికన్నా మించినది. ఆయన కోసం ఒకమారు తూర్పున ఉన్న కృష్ణ విగ్రహం తన భక్తుడికి దర్శనం ఇవ్వాలని ఒక్కసారిగా పడమర వైపుకు తిరిగింది. ఆలయం గోడ కూలిపోయింది. కనకదాసుకు కనకమహాలక్ష్మీ విభుడైన శ్రీ కృష్ణస్వామిదివ్య దర్శనం లభించింది. పూజారులు అప్రతిభులయ్యారు. కనకదాసు మహా భక్తికి నీరాజనాలు పలికి సగౌరవంగా ఆలయ ప్రవేశం చేయించారు. అంతటి గొప్ప భక్తి పరుడు.

Next Story