వేట్లపాలెం విస్పోటనం.. ఎస్పీ బిందు మాధవ్ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

వేట్లపాలెం విస్పోటనానికి 300 కిలోల బాణా సంచా నిల్వ చేయడమే కారణమని కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు..

వేట్లపాలెం విస్పోటనం.. ఎస్పీ బిందు మాధవ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వేట్లపాలెం(Vetlapalem) విస్పోటనానికి 300 కిలోల బాణా సంచా(Fireworks) నిల్వ చేయడమే కారణమని కాకినాడ ఎస్పీ బిందు మాధవ్(Kakinada SP Bindu Madhav) తెలిపారు. బాణసంచా పేలుడు ఘటన(Fireworks explosion incident)పై ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. బాణాసంచా నిర్వహకులు అర్జున్‌, నానిని అరెస్టు చేశామని తెలిపారు. అర్జున్‌కు లైసెన్స్ ఉందని, నానికి 500 కిలోల వరకు నిల్వ చేసుకునేలా ఎల్‌ఈ 5 లైసెన్స్ ఉందని స్పష్టం చేశారు. అయితే లైసెన్స్ గడువు త్వరలో ముగుస్తుందని, ఈ మేరకు ఎక్కువ నిల్వలు చేశారని వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల బ్యాంక్ ఖాతాలను సీజ్‌ చేశామని తెలిపారు. రాజమండ్రి పరిధిలో చాలా బాణసంచా కేంద్రాలను ఇప్పటికే మూసివేసిన్లు ఎస్పీ పేర్కొన్నారు. ‘‘వేరే బాణసంచా కేంద్రాల్లో కూడా మందుగుండు సామగ్రి నిల్వ చేశారు. 15 కిలలో కన్నా ఎక్కువ బాణాసంచా నిల్వ ఉంచారు. నిందితులపై గతంలో కేసులు లేవు. కేసులు ఉంటే లైసెన్స్‌ వచ్చేది కాదు.’’ అని ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు.

Next Story