Kakani Govardhan Reddy : రెండు రోజుల సిట్ కస్టడీకి కాకాణి

by Muthe.Rajitha |

నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్‌సీపీ(YSRCP) నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) సర్వేపల్లి రిజర్వాయర్‌లో అక్రమ గ్రావెల్ తవ్వకాల కేసులో, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీకి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్నారు.

Kakani Govardhan Reddy : రెండు రోజుల సిట్ కస్టడీకి కాకాణి
X

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్‌సీపీ(YSRCP) నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) సర్వేపల్లి రిజర్వాయర్‌లో అక్రమ గ్రావెల్ తవ్వకాల కేసులో, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీకి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్నారు. అక్రమ గ్రావెల్ కేసులో జూన్ 18న నెల్లూరు కోర్టు(Nelluru Court) కాకాణికి జూలై 2 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇప్పటికే అక్రమ క్వార్జ్ తవ్వకాలు, అట్రాసిటీ కేసులతో సహా మరో రెండు ఇతర కేసుల్లో నెల్లూరు జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనను.. అక్రమ గ్రావెల్ కేసులో మరింత విచారణ కోసం సిట్ నేడు రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి కోరింది.

కాగా జూన్ 25, 26 తేదీల్లో సిట్(SIT) విచారణకు నెల్లూరు కోర్టు అనుమతిచ్చింది. సిట్ అధికారులు కాకాణిని కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు. ఈ కేసులో ఆయన ఏ2 నిందితుడిగా ఉండగా, 61 వేల మెట్రిక్ టన్నుల గ్రావెల్‌ను ఆరు నెలల్లో అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Next Story