- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు మాజీ మంత్రి కాకాణి రెండో రోజు విచారణ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరదాపురంలో ప్రభుత్వ భూమి ఆక్రమించి అక్రమంగా క్వార్ట్జ్

దిశ, వెబ్ డెస్క్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరదాపురంలో ప్రభుత్వ భూమి ఆక్రమించి అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు జరిపారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తవ్వకాల కోసం అనుమతి లేకుండా పేలుడు పధార్థాలు వినియోగించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కాకాణిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆయన కృష్ణపట్నం పోలీస్ స్టేషన్‌లో కస్టడీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే నిన్న విచారణలో భాగంగా ఆయనను 22 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. కాగా అక్రమ మైనింగ్‌లో తన పాత్ర లేదని కాకాణి సమాధానం ఇచ్చినట్టు సమాచారం. అక్రమ మైనింగ్‌లో మీ పాత్ర ఉందని మీ అనుచరులే చెబుతున్నారని ప్రశ్నించినా..వాళ్లనే అడగండి అంటూ కాకాణి సమాధానం ఇచ్చారట. మొదటి రోజు రెండు గంటల పాటూ ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఈ రోజు సైతం ఆయనను విచారించనున్నారు. దీంతో ఈ రోజు అక్రమ మైనింగ్‌కు సంబంధించి కాకాణి ఎలాంటి సమాధానాలు ఇస్తారన్న ఉత్కంఠ నెలకొంది.






