ఎన్నాళ్ళీ ఖర్మ.. విసుగెత్తుపోతున్న ప్రయాణికులు

by Vemula.Srinu Prasad |

కాజులూరు మండలం చేదువాడలో రహదారి నిర్మాణ పనులు ప్రయాణికులను వేధిస్తున్నాయి. గ్రామంలో ఆర్‌అండ్‌బి అధికారులు పంచాయతీ నుంచి ఊరి చివరిదాకా సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ..

ఎన్నాళ్ళీ ఖర్మ.. విసుగెత్తుపోతున్న ప్రయాణికులు
X

దిశ, కాజులూరు ప్రతినిధి: కాజులూరు మండలం చేదువాడలో రహదారి నిర్మాణ పనులు ప్రయాణికులను వేధిస్తున్నాయి. గ్రామంలో ఆర్‌అండ్‌బి అధికారులు పంచాయతీ నుంచి ఊరి చివరిదాకా సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణం పూర్తి అయ్యి దాదాపుగా వారం రోజులు కావస్తుంది. రోడ్డు పనులు ప్రారంభించిన చోట ఓ పెద్ద కంకర గుట్ట, పనులు చివరగా మరో కంకర గుట్ట వేశారు. ఆ రెండు గుట్టలు అలాగే ఉంచేశారు. ప్రయాణికులు ఎంత మొరపెట్టుకున్నా ఆర్ఎంపీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అటుగా వెళ్లే రాకపోకలు పూర్తిగా బంధు అయ్యాయి.

ఆటోలు అయితే మూడు కిలోమీటర్ల ఎగస్ట్రా ఆల్ రౌండ్ తిరిగి రావాల్సి వస్తుంది. దీనివల్ల అధిక సొమ్ములు ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. అంతేగాక కార్లు బైకులు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సిమెంట్ రహదారి నిర్మాణం పూర్తయిన వెంటనే కంకరగుట్టలు తీసివేస్తే ఈ సమస్య ఉండదని ప్రయాణికులు అంటున్నారు. తక్షణమే స్పందించాలని కోరుతున్నారు

Next Story