షేక్ అహ్మద్ అక్బర్‌గా పేరు మార్చుకున్న వివేకానందారెడ్డి.... అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
షేక్ అహ్మద్ అక్బర్‌గా పేరు మార్చుకున్న వివేకానందారెడ్డి.... అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎఎస్ వివేకానందారెడ్డి తన పేరు మార్చుకున్నారని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తెలిపారు. వివేకానందారెడ్డి హత్య కేసులో అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన ఎంపీ అవినాశ్ రెడ్డి.. వివేకానందారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకానందారెడ్డికి రెండో భార్య ఉందని, ఆమెకు షహెషాన్ అనే కుమారుడు ఉన్నారని తెలిపారు. అయితే ఆస్తి మొత్తం ఆమెకు రాసిచ్చేందుకు వివేకానందారెడ్డి నిర్ణయించుకున్నారని అవినాశ్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన పేపర్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెప్పారు. షేక్ అహ్మద్ అక్బర్‌గా 2010లో వివేకానందారెడ్డి పేరు మార్చుకున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌పై తీవ్ర ఆవేదన

భాస్కర్ రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేశారని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. తాము చెప్పిన ఏ ఒక్క విషయాలను కూడా సీబీఐ అధికారులు పరిగణననలోకి తీసుకోవడంలేదని ఆయన వ్యా్ఖ్యానించారు. కీలకమైన అంశాల్ని సైతం సీబీఐ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వ్యక్తులే టార్గెట్‌గా సీబీఐ విచారణ కొనసాగుతోందని అవినాశ్ రెడ్డి అన్నారు. వివేకా హత్య విషయాన్ని పోలీసులకు తానే ఫస్ట్ చెప్పానని తెలిపారు. ఈ హత్యపై తనకంటే గంట ముందు వివేకా అల్లుడికి తెలుసని పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తననే దోషి అంటున్నారని తెలిపారు. ధైర్యం కోల్పోమని, నిజాయితీగా కేసును ఎదుర్కొంటామని కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు రిమాండ్‌

కాగా దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు రిమాండ్‌ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. విచారణ అనంతరం సీబీఐ అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల పూర్తైన అనంతరం సీబీఐ మెజిస్ట్రేట్ ఎదుట వైఎస్ భాస్కర్ రెడ్డిని హాజరుపర్చారు. దీంతో ఇరు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి : Breaking: ఎంపీ అవినాశ్‌రెడ్డికి సీబీఐ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం

Next Story

Most Viewed