తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఉపఎన్నిక

by Muthe.Rajitha |

రాష్ట్రంలోని కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ(ZPTC) స్థానాలకు నేడు ఉపఎన్నిక(By-Poll) జరుగుతున్న సంగతి తెలిసిందే.

తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఉపఎన్నిక
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ(ZPTC) స్థానాలకు నేడు ఉపఎన్నిక(By-Poll) జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు స్థానాల్లో కలిపి బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ టీడీపీ, వైసీపీ మధ్యనే అసలు పోరు నడిచింది. బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఉపఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. అయితే క్యూలో ఉన్న అభ్యర్థులు ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో చివరి ఓట్లు పోలవుతున్నాయి.

సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57 శాతం ఓటింగ్ నమోదవగా.. ఒంటిమిట్టలో 70 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలియజేశారు. భారీ భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను కడప పట్టణానికి తరలిస్తున్నారు. ఎల్లుండి ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరగనుంది. కాగా కొన్నిచోట్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరగడంతో ఆయా చోట్ల కొద్దిసేపు ఓటింగ్ నిలిపివేశారు.

Next Story