Court: వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై రేపు తీర్పు

by Vemula.Srinu Prasad |

వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది..

Court: వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై రేపు తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: సత్యవర్థన్ కిడ్నాప్ కేసు(Satyavardhan Kidnap Case)లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Gannavaram Former Mla Vallabhaneni Vamsi)ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే జైలులో సౌకర్యాలపై ఆయన విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు(Vijayawada Sc, St Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఇంటి భోజనంతో పాటు ఎత్తైన టేబుల్ ఏర్పాటు చేయాలని వంశీ కోరుతున్నారు.

ఇదిలా ఉంటే వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై ఈ రోజు కోర్టులో విచారణ జరిగింది. వంశీ హెల్త్ పిటిషన్‌పై వాదనలు సాగాయి. వంశీకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అందువల్ల ఆయనకు ఎత్తైన టేబుల్ ఏర్పాటు చేయాలని లాయర్ వాదనలు వినిపించారు. దీంతో జైలు సిబ్బంది, వైద్యుడిని అడిగి వివరాలు తెలుసుకుంటామని జడ్జి తెలిపారు. అంతేకాదు వల్లభనేని వంశీని ప్రత్యేక సెల్‌లో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. ఇందుకు సూపరింటెండెంట్ సమాధానమిస్తూ జైలులో బ్లేడ్, గంజాయి ముఠా సభ్యులున్నారని తెలిపారు. వంశీ భద్రత దృష్ట్యా ప్రత్యేక సెల్‌లో ఉంచామని పేర్కొన్నారు. దీంతో వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై శుక్రవారమ తీర్పు ఇస్తామని జడ్జి తెలిపారు. విచారణను వాయిదా వేశారు.

Next Story