- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూ. ఎన్టీఆర్ బర్త్ డే.. రెండు మేక పోతులను బలిచ్చి మరి..
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.

దిశ, డైనమిక్ బ్యూరో : జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తమ అభిమాన నటుడు పుట్టిన రోజు కావడంతో అభిమానులు సందడి చేశారు. కేక్ కట్ చేసి, అన్నదానం చేశారు. అంతేకాదు సింహాద్రి మూవీ రీ రిలీజ్ సందర్భంగా రచ్చరచ్చ చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో శనివారం ఆయన అభిమానులు హంగామా సృష్టించారు. ఇందులో భాగంగా విజయవాడ అప్సర థియేటర్‌లోనూ సింహాద్రి మూవీని రిలీజ్ చేశారు. మొదటి ఆట ప్రారంభమైన తర్వాత.. అభిమానులు థియేటర్ సందడి చేశారు. రంగు రంగుల పొగలు వెదజల్లే బాణసంచా కాల్చారు.
దీంతో థియేటర్లో పొగలు కమ్ముకున్నాయి.ఈ లోగా మరికొందరు అభిమానులు చిచ్చుబుడ్డి వెలిగించటంతో.. ఒక్కసారిగా మంటలు రేగాయి. సీట్లకు నిప్పు అంటుకోవటంతో అంతా ఉలిక్కిపాటుకు గురయ్యారు. యాజమాన్యం హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు. మూడు సీట్లు మాత్రమే కాలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని జీ3 థియేటర్‌లో సింహాద్రి సినిమా ప్రదర్శన సందర్భగా జూ.ఎన్టీఆర్ కటౌట్‌కి రెండు మేకపోతులను బలి ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం మధ్యాహ్నం పేదలకు అదే మటన్‌తో అన్నదానం నిర్వహించారు.
Also Read...






