- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులివ్వాలి
రాష్ట్రంలో జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) డిమాండ్ చేసింది.

దిశ, కర్నూలు ప్రతినిధి : రాష్ట్రంలో జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కొండప్ప, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ సలహాదారులు వైవీ. క్రిష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈ.ఎన్.రాజు, శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి అంజి, జిల్లా సహాయ కార్యదర్శి అవినాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి, మధు మాట్లాడుతూ.. జనవరిలో కొత్త అక్రిడేషన్లు ఇవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల మూడు నెలలు పాత కార్డులనే రెన్యువల్ చేశారన్నారు. మార్చి నెలాఖరుతో వాటి గడువు కూడా ముగిసిందన్నారు.
తిరిగి కొత్త అక్రిడేషన్ ఇవ్వడం గానీ, ఉన్న వాటిని రెన్యువల్ చేయడం గానీ ఇప్పటి వరకు జరగలేదన్నారు. కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రిడేషన్లను వెంటనే రెన్యువల్ చేయాలని, బస్ పాస్ లను తక్షణమే మంజూరు చేయాలన్నారు. అలాగే అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టు యూనియన్స్‌కు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ప్రతి మండలంలో 100 పత్రికలు అనే నిబంధనలను అక్రిడేషన్ మంజూరుకు తొలగించాలన్నారు. కొత్తగా ఇచ్చిన జీవోలో ఉన్న అసంబద్ధ నిబంధనలను తొలగించి కొత్త జీవోను ఇవ్వాలన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్క రించాలన్నారు. ఈ విషయంలో ఇంకా జాప్యం జరిగితే ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు చంద్ర శేఖర్, గోపాల్, శ్రీనాథ్ రెడ్డి, ఇస్మా యిల్, వీడియో జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు స్నేహాల్, శేఖర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.






