పవన్ సమక్షంలో కీలక నేతల చేరిక

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-02-21 15:28:37  IST  )

ఎన్నికల వేళ జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి. ..

పవన్ సమక్షంలో కీలక నేతల చేరిక
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి. ప్రతినిత్యం ఆపార్టీలో ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు చేరుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావుతో పాటు ఆయన భార్య ఉమాదేవి జనసేన పార్టీలో చేరారు. భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో వీరికి పవన్ కల్యాణ్ కండువా కప్పి సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కాకినాడకు చెందిన మత్స్యకార నాయకుడు మల్లాడి రాజేంద్రప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో బలంగా పని చేయాలని ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Read More : వైసీపీ, టిడిపి మధ్య ' కండోమ్ ' పాలిటిక్స్

Next Story