- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోగి రమేష్ నోరు పెద్ద డ్రైనేజీ.. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్
వీటీపీఎస్ (VTPS)లో ఫ్లైయాష్ టెండర్లు రద్దు చేయాలని, అక్రమంగా బూడిద నిల్వ చేసి హైదరాబాద్‌కు తరలించే ప్రక్రియను నిలిపివేయాలని మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: వీటీపీఎస్ (VTPS)లో ఫ్లైయాష్ టెండర్లు రద్దు చేయాలని, అక్రమంగా బూడిద నిల్వ చేసి హైదరాబాద్‌కు తరలించే ప్రక్రియను నిలిపివేయాలని మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) ఎప్పుడైతే అడుగుపెట్టాడో ఆ రోజు నుంచే దోచుకోవడం మొదలు పెట్టాడని ఆరోపించారు. కృష్ణ ప్రసాద్, ఆయన బావమరిది కలిసి అక్రమ ఫ్లైయాష్ యాష్ దందా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ వచ్చిన సొమ్ములో కొంత మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)కు చేరుతుందని సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో వాస్తవం ఉందా.. లేదా అన్నది ప్రజలకే తెలియాలని.. ఈ విషయంపై చర్చకు ఎక్కడికి రమ్మన్నా తాను రెడీ అని జోగి రమేష్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సవాల్ విసిరారు.
ఈ క్రమంలోనే జోగి రమేష్ వ్యాఖ్యలకు తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జోగి రమేష్ నోరు పెద్ద డ్రైనేజీ అని కామెంట్ చేశారు. మోరిగే పిచ్చి కుక్కలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. హుందాతనం, గౌరవం తెలియని వ్యక్తి జోగి రమేష్ అని ఫైర్ అయ్యారు. జోగి రమేష్‌లా తాను కూడా బూతులు మాట్లాడితే సచ్చి ఊరుకుంటాడని.. కానీ, తనకు సంస్కారం అడ్డొస్తుందని వసంతకృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






