నన్నెందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు : జోగి రమేశ్ ప్రధాన అనుచరుడు

by Naga Rani Yarlagadda |

ఇబ్రహీంపట్నం కల్తీ మద్యంకేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములను సిట్ అధికారులు అరెస్ట్ చేసి..

నన్నెందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు : జోగి రమేశ్ ప్రధాన అనుచరుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇబ్రహీంపట్నం కల్తీ మద్యంకేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములను సిట్ అధికారులు అరెస్ట్ చేసి, విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. అంతకుముందే జోగిరమేష్ ప్రధాన అనుచరుడైన ఆరేపల్లి రామును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపటి క్రితమే అతనిని విడిచిపెట్టగా.. తనను ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పలేదని మీడియాకు తెలిపాడు.

నకిలీ మద్యంకేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తన స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్న పోలీసులు.. వెంటనే విడిచిపెట్టారని చెప్పాడు. ఇక ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జనార్ధన్ రావుతో కేవలం పరిచయం మాత్రమే ఉందని, అతనితో ఎలాంటి లావాదేవీలు జరపలేదని రాము తెలిపాడు.

Next Story