- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ కేసులకు భయపడొద్దు.. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన జోగి రమేష్ కుటుంబ
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కొందామని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో : రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కొందామని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తాడేపల్లిలోని నివాసంలో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, వారి కుటుంబ సభ్యులు జగన్‌ను కలిశారు. నకిలీ మద్యం కేసులో అరెస్టై 83 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన జోగి సోదరులు తమకు ఎదురైన పరిస్థితులను వైఎస్ జగన్‌కు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్న తీరును వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ధైర్యం చెప్పిన అధినేత...
జోగి రమేష్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్, వారికి ధైర్యం చెప్పారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి పోరాడాలని సూచించారు. అక్రమ కేసులను ఎదుర్కొంటున్న నాయకులకు, కార్యకర్తలకు పార్టీ లీగల్ సెల్ ద్వారా పూర్తిస్థాయి న్యాయ సహాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న వేధింపులకు భయపడకుండా, చట్టపరంగా పోరాటం సాగించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ భేటీలో జోగి రమేష్ కుటుంబ సభ్యులతో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.






