- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసులో (Fake Liquor Scam) నిందితులైన జోగి సోదరులను (Jogi Brothers) నేడు విజయవాడ జైలుకు తరలించనున్నారు. ఇటీవల వారిని విచారణ నిమిత్తం ఎక్సైజ్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారంతో వారి కస్టడీ ముగిసింది. దీంతో తిరిగి విజయవాడ కోర్టుకు వారిని తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. తంబళ్లపల్లె (Tamballapalle) కోర్టును వారిని ఆదివారం రాత్రి వారిని హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. కోర్టులో హాజరుపరిచి మదనపల్లె సబ్ జైలుకు తాత్కాలికంగా తరలించామన్నారు. చట్టపరమైన ప్రక్రియ అనంతరం తిరిగి వారిని విజయవాడ జైలులో అప్పగిస్తామన్నారు. మూడు రోజులపాటు ఏ32 జోగి రమేశ్, ఏ33 జోగి రాములను విచారించిన కీలక విషయాలు రాబట్టామని తెలిపారు. ఇదిలా ఉండగా జోగి రమేశ్ కుమార్ రాజీవ్ తంబళ్లపల్లె కోర్టు వద్ద నిందితులై జోగి సోదరులను కలిశారు. ఆయనతో పాటు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి ఉన్నారు. జోగి రమేశ్ తో వారు వ్యక్తిగతంగా మాట్లాడినట్లు సమాచారం. నిందితుల తరలింపు నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలియజేశారు.






