- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి ఆలయంలో అపచారం.. స్వామివారి ఆభరణాలు మాయం
by Gantepaka Srikanth |
పవిత్ర వైకుంఠ తొలి ఏకాదశి రోజున నకిలీ ఆభరణాలతో స్వామివారిని అలంకరించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నంద్యాల జిల్లా(nandyala District)లోని వెంకటేశ్వర స్వామి ఆలయం(Venkateswara Swamy Temple)లో అపచారం జరిగింది. స్వామివారి వెండి ఆభరణాలు మాయం అయ్యాయి. పవిత్ర వైకుంఠ తొలి ఏకాదశి రోజున నకిలీ ఆభరణాలతో స్వామివారిని అలంకరించారు. చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న భక్తులు ఆలయ సిబ్బంది ఆగ్రహం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆలయంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. స్వామివారి ఆభరణాలు మాయం కావడం అనేది తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో తరచుగా జరుగుతున్నాయి. ఇటీవల అనేక ఆలయాల్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆలయాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Next Story






