రేపు నిరాహార దీక్ష చేస్తున్నా: జేసీ ప్రభాకర్ రెడ్డి

by Vemula.Srinu Prasad |

2026లోనూ తాడిపత్రిని అభివృద్ధి చేయాలనే కోరిక ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు...

రేపు నిరాహార దీక్ష చేస్తున్నా: జేసీ ప్రభాకర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: 2026లోనూ తాడిపత్రి(Tadipatri)ని అభివృద్ధి చేయాలనే కోరిక ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి(Jc Prabakar Reddy) అన్నారు. జనవరి 1న తాడిపత్రిలో గాంధీ విగ్రహం (Gandhi Statue)వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తన మనసులోని అభిప్రాయాలను ప్రజలకు చెప్పేందుకు దీక్షకు దిగుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల సహకారంతోనే తాము ఇంత వరకూ వచ్చామని పేర్కొన్నారు. చాలా మందికి తనపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. తాను ఎందుకు అలా చేస్తున్నానో తెలియజేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Next Story