- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయలసీమ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఈడ్చి కొడతారు : కేతిరెడ్డిపై జేసీ ఫైర్
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. రాయలసీమకు పౌరుషం లేదని చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. రాయలసీమకు పౌరుషం లేదని చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఎక్కడపడితే అక్కడ ఏదిపడితే అది మాట్లాడి.. షో ఆఫ్ చేస్తున్నారని, ఆయన ఫ్యామిలీతో టూర్ కు వెళ్లినా ఫొటోలు పెడుతున్నారని.. ఇదంతా షో ఆఫ్ అన్నారు. రాయలసీమకు పౌరుషం లేదంటే ప్రజలు చెప్పుతో కొడతారని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. రాయలసీమ రాయల్ సీమ అని తొడలు కొట్టుకోవడం, రాత్రయితే కారం ఎక్కువ తినడం, తర్వాత పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప.. ఇంతకుమించి చేసిందేమీ లేదని కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఊరికే ఉప్పుకారం తినడం, లేని పౌరుషాలు చెప్పుకోవడం అని చేసిన వ్యాఖ్యలపై జేసీ తీవ్రంగా స్పందించారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై డిబేట్ కు రెడీ
5 సంవత్సరాలుగా ఉప్పు కారం తిని.. 15 నెలలుగా కేతిరెడ్డికి పైల్స్ వచ్చాయని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. డ్రైనేజ్ కాలువను చూసేందుకు వస్తే.. మా ఇంటి వద్దకు ఎందుకు వస్తారన్నప్పుడే నీ జ్ఞానం ఏంటో తెలిసిందన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దమ్ముంటే డిబేట్ కు వచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై చర్చించాలని, ఎవరేం చేశారో ప్రజలకు కూడా తెలుస్తుందని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎవరెవరు ఎన్ని నీళ్లు తెచ్చారో డిబేట్ కు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. ఈడ్చి కొడతారు
ఆ అంటే, ఊ అంటే చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడం తగదని సూచించారు. చంద్రబాబు నాయుడి గురించి ఏం తెలుసని మాట్లాడుతారని ప్రశ్నించారు. తాను జగన్ కన్నా పెద్దోడినే అయినా.. ఏనాడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడదని, అది ఒక లీడర్ కు ఇచ్చే రెస్పెక్ట్ అన్నారు. అసలు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేతిరెడ్డి ధర్మవరంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. రాయలసీమ ప్రజల గురించి ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలు పొట్టు పొట్టు తంతారన్నారు. ఇలాగే మాట్లాడితే.. వచ్చే ఎన్నికల్లో జగన్ నీకు టికెట్ కూడా ఇవ్వరన్నారు. పుట్లూరు చెరువు గేట్లు పాడైతే కనీసం రిపేర్ కూడా చేయించలేదని, తాను వెళ్లి రిపేర్ చేయించాక నీళ్లొచ్చాయన్నారు.
దమ్ముంటే తాడిపత్రికి రా.. అవసరమైతే మళ్లీ జైలుకెళ్తా
నిన్న రోజా వచ్చి కూడా మళ్లీ అధికారంలోకి వచ్చాక తామేంటో చూపిస్తామని అన్నారని, ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాట్లాడాలని సూచించారు. ఊరికే రప్పా రప్పా అంటే.. ఎవరూ చూస్తూ ఊరుకోరన్నారు. చంద్రబాబునాయుడిలో ఒక పవర్ ఉందని, ఆయన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దన్నారు. మూడేళ్ల తర్వాత కాదు.. దమ్ముంటే కేతిరెడ్డి తాడిపత్రికి వచ్చి మాట్లాడాలని, ఏదైతే అది తేల్చుకుందామన్నారు. అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు తాను రెడీగా ఉన్నానన్నారు.
Read More..






