పెద్దారెడ్డి అక్ర‌మంగా క‌ట్టిన ఇల్లు కూల్చేస్తా.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వార్నింగ్

by Ajay Maddhiboyina |

తాడిప‌త్రిలో టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య వార్ కొన‌సాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

పెద్దారెడ్డి అక్ర‌మంగా క‌ట్టిన ఇల్లు కూల్చేస్తా.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: తాడిప‌త్రిలో టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య వార్ కొన‌సాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాడిప‌త్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి హైకోర్టు ఆర్డ‌ర్ ఇచ్చినా జేసీ అడ్డుకుంటున్నార‌ని సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి రాంభూపాల్ చేసిన వ్యాఖ్య‌లకు జేసీ స్పందించారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు పెద్దారెడ్డి త‌న ఇంట్లోకి వ‌చ్చాడ‌ని అన్నారు. నీ శ‌త్రువు నీ ఇంటికి వ‌స్తే ఎలా ఉంటుంది అని రాంభూపాల్ ను ప్ర‌శ్నించారు.

అధికారంలో ఉన్న‌ప్పుడు పెద్దారెడ్డి ఆగ‌డాల‌కు అడ్డేలేద‌ని మండిప‌డ్డారు. పుట్లూరు మండ‌లం కోమ‌టికుంట‌లో సోలార్ భూముల‌ను పెద్దారెడ్డి బ‌ల‌వంతంగా రైతుల ద‌గ్గ‌ర నుండి లాక్కున్న‌ప్పుడు నీకు క‌న‌ప‌డ‌లేదా అని ప్ర‌శ్నించారు. నా అనుచ‌రుడు పొట్టి ర‌వికి హైకోర్డు ఆర్డ‌ర్ ఇచ్చినా పోలీసుల అండ‌తో పెద్దారెడ్డి అత‌డిని ఐదు సంవ‌త్స‌రాలు తాడిప‌త్రికి రానివ్వ‌లేద‌ని మండిప‌డ్డారు. తాడిప‌త్రిలో మ‌హిళా కౌన్సిల‌ర్ల‌పై మ‌ర్డ‌ర్ కేసులు బ‌నాయించి జైలుకు పంపించిన ఘ‌న‌త పెద్దారెడ్డిదే అని మండిప‌డ్డారు.

పెద్దారెడ్డి పోలీసుల సాయంతో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై పీడీ యాక్ట్, రౌడీ షీట్లు న‌మోదు చేశాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెద్దారెడ్డి అక్ర‌మంగా నిర్మించిన ఇల్లు కూల్చేస్తాన‌ని ఫైర్ అయ్యారు. రైతుల నుండి ఆక్ర‌మించుకున్న భూముల ఫెన్సింగ్ పీకేస్తాన‌ని అన్నారు. త‌న బ‌స్సుల‌ను ఐదేళ్లు న‌డ‌వ‌నివ్వ‌క‌పోయినా ఒక్క నాయ‌కుడూ మాట్లాడ‌లేద‌ని చెప్పారు. గ‌తంలో పెద్దారెడ్డి ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా ఫ్యాక్ష‌న్ చేస్తాన‌ని అన్నాడు, ఇప్పుడు తాడిప‌త్రికి రావాలి ఫ్యాక్షన్ చేయాల‌ని స‌వాల్ చేశారు.

Next Story