- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై జేసీ ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై (Byreddy Siddharth Reddy) జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు

దిశ, వెబ్ డెస్క్: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై (Byreddy Siddharth Reddy) జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఊరికి వచ్చి నా గురించి మాట్లాడే ధైర్యం ఉందా? అని సవాల్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నీ లాంటి వాళ్లని ఎంతమందినో చూశాను.. నా గడ్డం, నా నెత్తి సరిపోదు పోల్చడానికి.. ఇంకా చాలా వెంట్రుకలు కావాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Pedda Reddy) పాదయాత్ర సందర్భంగా పెద్ద పప్పూరులో జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
అయితే ఆ వ్యాఖ్యలకు తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీలాంటి బచ్చా లీడర్లు ఎంతోమంది.. వచ్చి వెల్లిపోయారని.. ఫైర్ అయ్యారు. రప్పా రప్పా... కాదు రాత్రిపూట కన్ను ఎగిరేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుస్తుందని.. సిద్ధార్థ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నువ్వు మాట్లాడే భాష మేం మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు అంటూ వ్యాఖ్యానించారు. నీ కంటే బండ బూతులు మాట్లాడడం కూడా తనకు వస్తుందని గుర్తు చేశారు. పొగరు తగ్గించుకొని.. అనిగిమనిగి ఉండు... భవిష్యత్తు నీకు ఉంది.. దాన్ని కాపాడుకో అంటూ సూచనలు కూడా ఇచ్చారు జేసి ప్రభాకర్ రెడ్డి. దీంతో జేసీ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.






