పరిటాల శ్రీరామ్‌కు సన్మానం చేసిన జేసీ ప్రభాకర్

by Gantepaka Srikanth |

అనంతపురం రాజకీయా(Anantapur Politics)ల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ(TDP) నేత పరిటాల శ్రీరామ్‌(Paritala Sriram)కు జేసీ ప్రభాకర్(JC Prabhakar) సన్మానం చేశారు.

పరిటాల శ్రీరామ్‌కు సన్మానం చేసిన జేసీ ప్రభాకర్
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం రాజకీయా(Anantapur Politics)ల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ(TDP) నేత పరిటాల శ్రీరామ్‌(Paritala Sriram)కు జేసీ ప్రభాకర్(JC Prabhakar) సన్మానం చేశారు. రాప్తాడు అగ్రికల్చర్‌ సదస్సులో ఈ సన్మానం చేశారు. అంతేకాదు.. వ్యవసాయ సదస్సు ఏర్పాట్లను జేసీ ప్రభాకర్ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్‌, పరిటాల శ్రీరామ్‌ మధ్య సరదా చర్చ జరిగింది. రాజకీయాల్లో ఇది శుభపరిణామం అని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. జేపీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి, పరిటాల శ్రీరామ్ కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయంటూ గతంలో అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయంటూ వార్తల్లో పేర్కొన్నారు. అయితే.. అనూహ్యంగా ఇవాళ్టి పరిణామంతో ఇరువురి అభిమానులు, టీడీపీ(TDP) శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కలిసి ముందుకు వెళితే పార్టీ మరింత బలపడటంతో పాటు కార్యకర్తలు చెదిరిపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story