Janasena: 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులకు పవన్ కళ్యాణ్ కీలక పిలుపు

by Ramesh Goud |   (  Updated:2025-01-25 06:54:37  IST  )

18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) కీలక పిలుపునిచ్చారు.

Janasena: 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులకు పవన్ కళ్యాణ్ కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవం(National Voters Day) సందర్భంగా ట్విట్టర్ లో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన.. ఓటు అనేది మనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు(Fundumental Right) అని తెలిపారు. అలాగే ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలన్నా, రాజ్యాంగ విలువలు కాపాడాలన్నా, సరైన నాయకులను చట్ట సభలకు పంపించాలని సూచించారు. అలాంటి వారిని ఎన్నుకుని మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు అని, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్క యువతీ, యువకుడు తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకుని, విధిగా ఓటింగ్(Voting) లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ కోరారు. భాతరదేశంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించి, ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రతీ ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుతోంది.

Next Story