Janasena:పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ పక్కా.. జనసేన పార్టీ కొత్త పాట రిలీజ్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-12 08:53:36  IST  )

ఏపీ(Andhra Pradesh)లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) జనసేన(Janasena) ఘన విజయం సాధించింది.

Janasena:పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ పక్కా.. జనసేన పార్టీ కొత్త పాట రిలీజ్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) జనసేన(Janasena) ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచి 100 శాతం స్ట్రైక్ సాధించింది. ఇక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక మొదటిసారి జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM pawan kalyan) పార్టీ ఆవిర్భావ దినోత్సవ తేదీ ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభ కోసం పార్టీ నేతలు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 10 లక్షల మందితో సభను నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు, ప్రజల్లో జోష్ నింపేందుకు జనసేన ఓ కొత్త పాటను విడుదల చేసింది. ‘‘జెండర.. జెండర.. జెండర.. సామాన్యుడికి అండరా.. పిడికిలి బిగించి పట్టారా ఇది జనసేనాని జెండర..’’ అంటూ ఈ సాంగ్ పవర్ ఫుల్‌గా సాగింది. ఈ పాటకి దుంపటి శ్రీనివాస్ లిరిక్స్ రాయగా సింధు కె.ప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఇప్పటికే జనసేన పార్టీ పై పలు సాంగ్స్ ఉండగా తాజాగా ఆవిర్భావ దినోత్సవం ముందు మరో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు(Konidela Nagababu) రిలీజ్ చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు(Pawan fans) ఈ పాట(Song)ను వైరల్ చేస్తున్నారు.

https://youtu.be/VmH4n8csVAo?si=EAqynUZi-wu_63AO

Next Story