- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం
రేపటి నుంది ఆంధ్రప్రదేశ్(AP) అసెంబ్లీ(Assembly)బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan)అధ్యక్షతన జనసేన(Janasena)శాసనసభాపక్షం (Legislative Assembly party meeting) సమావేశం ప్రారంభం అయింది.

దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంది ఆంధ్రప్రదేశ్(AP) అసెంబ్లీ(Assembly)బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan)అధ్యక్షతన జనసేన(Janasena) శాసనసభాపక్షం (Legislative Assembly party meeting) సమావేశం ప్రారంభం అయింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. అలాగే రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 పై అవగాహన, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వైఖరి, బడ్జెట్ పై చర్చలో అనుసరించాల్సిన తీరుపై ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ తమ పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది.
ఈ సమావేశానికి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena chief Pawan Kalyan)తో పాటు.. మంత్రులు నాదేండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, లోకం మాధవి, పులపర్తి ఆంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్, బొమ్మిడి నాయకర్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, అరణి శ్రీనివాసులు, భాస్కరరావు, మండలి బుద్ద ప్రసాద్, నిమ్మక కృష్ణ, వంశీ కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం (Governor's speech)తో ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly meetings) ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఫిబ్రవరి 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. 26, 27 అసెంబ్లీకి సెలవు దినాలు. 28వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు.






