Janasena: పవన్ కల్యాణ్‌కు శత్రువు అవ్వాలంటే అర్హత ఉండాలి

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-11 06:36:58.0  )
Janasena: పవన్ కల్యాణ్‌కు శత్రువు అవ్వాలంటే అర్హత ఉండాలి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన(Janasena) పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన గురించి ఇండియావైడ్ చర్చ జరిగింది. ఇందుకు కారణం ఆయన ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుపొందడమే. అలాంటి పవన్ కల్యాణ్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్ రావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఆయన పేషీకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌లు చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. అసభ్య పదజాలంతో దూషించారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన పేషీ అధికారులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. హోంమంత్రి అనిత సైతం స్పందించి నిందితులను తక్షణమే పట్టుకొని శిక్షించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సోమవారం ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘ఈ ప్రపంచంలోనే అత్యంత సులభమైన పని అతనితో స్నేహం చేయడం.. అతనితో జట్టు కట్టడం.. అతనికి సన్నిహితుడిగా ఉండడం.. కానీ, అతని శత్రువుగా అవ్వాలంటే మాత్రం చాలా అర్హతలు ఉండాలి’’ అని ట్వీట్‌లో నాగబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story