మా కులపోళ్ల వెంట అమ్మాయిలు కుక్కల్లా పడతారు.. జనసేన మహిళా నేత వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

కాపుల అబ్బాయిల వెంట అమ్మాయిలు కుక్కల్లా పడతారు అంటూ జనసేన మహిళా అధికార ప్రతినిధి కన్నా రజిని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మా కులపోళ్ల వెంట అమ్మాయిలు కుక్కల్లా పడతారు.. జనసేన మహిళా నేత వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: కాపుల అబ్బాయిల వెంట అమ్మాయిలు కుక్కల్లా పడతారు అంటూ జనసేన మహిళా అధికార ప్రతినిధి కన్నా రజిని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలోనే మహిళ ఈ వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ టీవీ ఇంటర్వ్యూలో రజిని మాట్లాడుతూ.. కాపులు కులాన్ని పెంచేస్తున్నారని అన్నారు. తమ కులపోళ్లు కమ్మవాళ్ల అమ్మాయిలను ప్రేమిస్తారని అన్నారు. వంగవీటి రంగా కమ్మ అమ్మాయినే ప్రేమించారని చెప్పారు. అల్లు అర్జున్ రెడ్డి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అన్నారు. రామ్ చరణ్ కూడా రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అన్నారు. విడదల రజిని కూడా తమ కాపు కులానికి చెందిన అబ్బాయినే ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పారు.

తమ కాపోళ్ల అబ్బాయిల వెనుక అన్ని కులాల అమ్మాయిలు కుక్కలు పడిపోయినట్టు పడిపోతుంటారని అందుకే పాపం లీగల్ గా పెళ్లి చేసుకుంటారని అన్నారు. ఇదిలా ఉంటే కన్నా రజిని తాజాగా సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో దాడులు ఎవరు చేసినా ఖండించాల్సిందేనని అన్నారు. అంబటి వివాదం టీడీపీ వైసీపీ మధ్యనేనని అన్నారు. జనసేనకు సంబంధం లేదని చెప్పారు. అయినప్పటికీ కూటమి ధర్మానికి కట్టుబడి జనసేన పార్టీ అధికార ప్రతినిధి పదవి నుండి పక్కకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు. పోలీసులు ఉండగానే టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లు పట్టుకుని అంబటిపై దాడికి దిగడం సరికాదన్నారు. పోలీసు వ్యవస్థను అధికారపార్టీ శాసిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story