Tenali: వినూత్న రీతిలో మంత్రి నాదెండ్ల.. వాటే థాట్ అంటూ ప్రశంసలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-27 06:35:51  IST  )

జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ వినూత్న రీతిలో ముందుకు సాగుతున్నారు...

Tenali: వినూత్న రీతిలో మంత్రి నాదెండ్ల.. వాటే థాట్ అంటూ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన(Jansena) నేత, మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) వినూత్న రీతిలో ముందుకు సాగుతున్నారు. పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సొంత నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై దృష్టిపెట్టారు. ఎప్పటికప్పుడు ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటి దగ్గరకే కాదు. బయట కూడా స్వయంగా వెళ్తున్నారు. అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేయిస్తున్నారు.

తెనాలి(Tenali) వార్డుల్లో తాజాగా ఆయన పర్యటించారు. పేరంటాలమ్మ ఆలయం(Perantalamma Temple)లో పూజలు చేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వార్డుల్లో తిరుగుతూ స్వయంగా ప్రజలను కలిశారు. సమస్యలు తెలుసుకుని వెంటనే సమస్యలు పరిష్కరిస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ రెడీ ఉంటుందని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇందులో భాగంగానే తన నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నానని తెలిపారు. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Next Story