Janasena: దూకుడు పెంచిన పవన్... జిల్లాల పర్యటనకు శ్రీకారం

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-12-25 14:02:29  IST  )

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీస్తున్న వేళ జిల్లాల పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టారు. ..

Janasena: దూకుడు పెంచిన పవన్... జిల్లాల పర్యటనకు శ్రీకారం
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీస్తున్న వేళ జిల్లాల పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో మకాం వేయనున్నారు. కాకినాడ జిల్లా నేతలు, ఇంచార్జులు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, తెలుగు దేశం పార్టీతో సమన్వయం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించనున్నారు. ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేలా వ్యూహ రచన చేయనున్నారు. కాకినాడ పార్లమెంట్‌పై కూడా పవన్ కల్యాణ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

కాగా టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే పొత్తులు, సీట్లపై ఇంకా తేల్చలేదు. కానీ జిల్లాల్లో ఇప్పటికే టీడీపీ, జనసేన కార్యకర్తలను మధ్య సమన్వయం నెలకొల్పుతున్నారు. ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లేందుకు వారిని తయారు చేస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు సహకరించేలా స్నేహభావాన్ని నింపుతున్నారు. ఇప్పటికే వారాహి యాత్రతో జిల్లాలను చుట్టేసిన ఆయన మరోసారి కాకినాడ పర్యటనకు శ్రీకారం చుట్టారు.

Next Story