- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్తీ మద్యం కేసులో ట్విస్ట్.. ఎక్సైజ్ పోలీసులకు షాక్ ఇచ్చిన నిందితుడు
ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యంకేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యంకేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి.. రాత్రి కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనలు విన్న జడ్జి.. ఈనెల 17వ తేదీ వరకూ జనార్దన్ కు రిమాండ్ విధించారు.
తాజాగా ఈ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. జనార్దన్ ను పోలీసులు అతని మొబైల్ గురించి ఆరా తీశారు. సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుండగా.. తన ఫోన్ ముంబై ఎయిర్ పోర్టులో పోయిందని బదులిచ్చాడు. జనార్దన్ ఫోన్ దొరికితే.. కాల్ డేటా ఆధారంగా ఈ కేసులో ఇంకెవరెవరు ఉన్నారో తెలుసుకోవచ్చని పోలీసులు భావించిన తరుణంలో.. ఊహించని షాక్ తగిలినట్లైంది. జనార్దన్ పేరుతో మళ్లీ అదే సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Next Story






