- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన ఆశావహులకు తీపికబురు.. త్వరలోనే కీలక పదవులు
జనసేన ఆశావహులకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీపికబురు అందించారు. ...

దిశ, వెబ్ డెస్: జనసేన(Janasena) ఆశావహులకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీపికబురు అందించారు. త్వరలోనే కీలక పదవులు భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకంటించారు. మంగళగిరి(Mangalagiri) జనసేన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పలు కార్పొరేషన్‌ల చైర్మన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో మరిన్ని కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఇప్పటికే జనసేనలో 3400 మంది నామినేటెడ్ పదవులు పొందారని తెలిపారు. జనసేన సిద్ధాంతాలు నచ్చి కొంతమంది పార్టీలో చేరారని, అటువంటి వారికి కూడా పదవులు ఇచ్చేందుకు పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నారు. ఇకనుంచి జనసేన నేతలందరూ కలిసి చేయాలని సూచించారు. ప్రైవేటు సెటిల్ మెంట్లకు వెళ్లొదన్నారు. అధికారాన్ని ఎవరూ దుర్వినియోగం చేయొద్దని, అలా చేస్తే ఊరుకునేదిలేదని పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ హెచ్చరించారు.






