- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేన కోసం చావడానికైనా సిద్ధం.. దమ్ముంటే రండి చూసుకుందాం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా జనసేన పార్టీ నాయకురాలు సుభాషిణి వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని, ప్రాణహాని తలపెట్టేందుకు కూడా వెనకాడటం లేదని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. గతంలో జనసేనాని పవన్ కల్యాణ్‌పై వైసీపీ నాయకురాలు రోజా చేసిన విమర్శలను తాను తిప్పికొట్టానని, అప్పటి నుంచే వైసీపీ శ్రేణులు తనను టార్గెట్ చేశాయని సుభాషిణి పేర్కొన్నారు.
"పవన్ కల్యాణ్‌పై రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నేను కౌంటర్ ఇచ్చాను. నాటి నుండి వైసీపీ నేతలు నన్ను వ్యక్తిగతంగా దూషిస్తూ, సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు." అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ముఖ్య నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలను ఉద్దేశించి సుభాషిణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘భూమన కరుణాకర్ రెడ్డికి, అభినయ్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నాను. దమ్ముంటే రండి.. ఎక్కడో తేల్చుకుందాం. నన్ను భయపెట్టాలని చూస్తే అది మీ భ్రమే. జనసేన పార్టీ కోసం, పవన్ కల్యాణ్ కోసం చావడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను’’ అని సవాల్ చేశారు.






