దేశం ముందు YSRCP క్షమాపణ చెప్పాలి: జనసేన ఎంపీ డిమాండ్

by Vemula.Srinu Prasad |

తిరుపతి లడ్డూలో భారీ కల్తీ జరిగిందని, YSRCP దేవుడిని ఎప్పుడూ నమ్మదని జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

దేశం ముందు YSRCP క్షమాపణ చెప్పాలి: జనసేన ఎంపీ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి లడ్డూ(Tirupati Laddu)లో భారీ కల్తీ జరిగిందని, YSRCP దేవుడిని ఎప్పుడూ నమ్మదని జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(Janasena MP Tangella Uday Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీపై తమ నాయకుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) తొలి నుంచి పదే పదే చెప్పారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని సిట్ కూడా నివేదిక ఇచ్చిందని తెలిపారు. లడ్డూల పంపిణీలో ఇది అతిపెద్ద పాపమని చెప్పారు. దేశం ముందు YSRCP క్షమాపణ చెప్పాలని జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.


Next Story