- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంగాను ప్రభుత్వమే చంపించింది : జనసేన ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వంగవీటి రంగా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వంగవీటి రంగా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నేడు ఓ సమావేశంలో ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా పేరొందిన దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహన రంగాపై కీలక వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగాను కొంతమంది నాయకులు కలిసి అప్పటి ప్రభుత్వం ద్వారా 1988 డిసెంబర్ 26న హత్య చేయించారని ఆరోపించారు. రంగా తన రక్షణ కోసం నిరాహార దీక్ష చేసినప్పటికీ, ఆయన హత్యను అడ్డుకోలేకపోయారని మండిపడ్డారు.
బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అనేక పోరాటాలు చేశారని, అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మరో వంగవీటి రంగాగా ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ ప్రజల కోసం ఏదైనా చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటారని, ప్రజల తల్లో నాలుక లాంటివాడని కొనియాడారు.






