‘ప‌రిచ‌య‌మైన రెండ్రోజుల‌కే’.. జ‌న‌సేన ఎమ్మెల్యే బాధితురాలి వీడియో విడుద‌ల

by Ramesh Naini |   (  Updated:2026-01-27 14:21:26  IST  )

జనసేన ఎమ్మెల్యే (ప్రభుత్వ విప్) అరవ శ్రీధర్ రాసలీలల వీడియో అంటూ బయటకు రావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

‘ప‌రిచ‌య‌మైన రెండ్రోజుల‌కే’.. జ‌న‌సేన ఎమ్మెల్యే బాధితురాలి వీడియో విడుద‌ల
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన ఎమ్మెల్యే (ప్రభుత్వ విప్) అరవ శ్రీధర్ రాసలీలల వీడియో అంటూ ఆరోపణలు బయటకు రావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. వీడియోలో ఉన్న బాధిత మహిళాను నేను అంటూ ఓ మహిళ ఘటనపై స్పందించింది. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక వీడియో విడుదల చేసింది. బాధిత మహిళ మాట్లాడుతూ.. ‘ఆ వీడియోలో ఉన్న మహిళను నేనే. నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తుంటాను. గత సంవత్సరం జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా అర‌వ శ్రీ‌ధ‌ర్ అవ్వడంతో ఫెస్‌బుక్‌లో కంగ్రాట్స్ మెసేజ్ పెట్టాను. మొదటి రోజు నాతో రెండు మూడు గంటలు మాట్లాడాను. నా నెంబర్ తీసుకొని, అతని నెంబర్ నాకు ఇచ్చాడు. టెలిగ్రామ్ యాప్‌లో నాకు మెసేజ్ చేశాడు. నా గురించి, నా కుటుంబ నేపథ్యం గురించి ఆయన తెలుసుకుంటూ వచ్చాడు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నారని తెలుసుకున్నాడు. నేను నా బాబుతో ఉంటానని చెప్పాను. అలా అనుకోవద్దు నువ్వు ఒంటరి కాదు. నేను నీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.’ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే, ‘నేను ఆయనతో నార్మల్‌‌గానే మాట్లాడుతూ వచ్చాను. ప‌రిచ‌య‌మైన రెండ్రోజుల‌ తర్వాత నా న్యూడ్ ఫోటోలు అడగడం స్టార్ట్ చేశాడు. వీడియో కాల్ చేయాలని బలవంతం చేశాడు. ఇందంతా కరెక్ట్ కాదని నేను అన్నాను. కానీ అతను నన్ను బెదిరించాడు. నీ కొడుకు, నువ్వు మాత్ర‌మే ఉంటున్నారు జాగ్ర‌త్త‌.. ఇది నా కోడూరు, నా నియోజ‌క‌వ‌ర్గం, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తా.. నీకు ట్రాన్స్‌ఫర్లు కావాల‌న్నా.. నా ద‌గ్గ‌రికి రావాల‌ని బెదిరించాడు. అయినా కూడా నేను న్యూడ్స్ పంపలేదు.. తర్వాత కలవాలని టార్చర్ చేశాడు. దీంతో జూలై 9 ఫస్ట్ టైమ్ కలిశాను. క‌డ‌ప‌కు వెళ్దామ‌ని కారులో తీసుకెళ్లి.. రాజంపేట వ‌ద్ద నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి, నా ప్రైవేట్ పార్ట్స్ తాకాడు. బలవంతంగా దగ్గరకు తీసుకున్నాడు. నేను అలాంటి దాన్ని కాదని చెప్పినా వినలేదు.’ అని బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేసింది.

‘నేను కారు డోరు ఓపెన్ చేయ‌బోతే గ‌ట్టిగా కొట్టి న‌న్ను కారులోనే రేప్ చేశాడు. అలా నాపై మొదటి సారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరింపులకు దిగాడు. తర్వాత నాకు అతని వల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇది నేను అతనికి చెప్పాను. ఆగ‌స్టులో ఫ‌స్ట్ ప్రెగ్నెన్సీ వ‌స్తే దాన్ని అబార్ష‌న్ చేయించుకోవాల‌ని ఒత్తిడి చేశాడు. పెళ్లి చేసుకుంటాన‌ని ప్రామీస్ చేయ‌డంతో అబార్ష‌న్ చేసుకున్నా.. గ‌త ఏడాదిన్న‌ర కాలంలో 5సార్లు అబార్ష‌న్స్ అయ్యాయి.. నా భ‌ర్త‌కు కాల్ చేసి విడాకులు ఇవ్వాల‌ని బెదిరించాడు.. ఏడాదిన్న‌ర‌గా న‌న్ను టార్చ‌ర్ చేశాడు. తర్వాత ఈ విషయం ఇంట్లో వారికి చెప్పాను, అతని వల్ల నరకం చూశాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలి’ బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

READ MORE ....

రాష్ట్రంలో కలకలం.. జనసేన ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్

కులం పేరు చెప్పి నా కొడుకుకు దగ్గరైంది.. జనసేన ఎమ్మెల్యే తల్లి స్పందన

Next Story