- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫేక్ వీడియోలు.. లైంగిక ఆరోపణలను ఖండించిన జనసేన ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
తనపై ఓ యువతి చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ ఖండించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తనపై ఓ యువతి చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ ఖండించారు. మంగళవారం ఆయన ఘటనపై మాట్లాడుతూ.. నాపై ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నన్నే ఆరు నెలలుగా వేధింపులకు గురిచేశారు, వేధింపులపై నా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. నాపై ఆరోపణలకు కోర్టు ద్వారా సమాధానం చెబుతానని అన్నారు. ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేదని తెలిపారు. నాపై చేసిన కుట్ర దారులను వదిలేది లేదని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. కాగా, అరవ శ్రీధర్(MLA Arava Sridhar)పై వస్తున్న లైంగిక ఆరోపణలను ఆయన తల్లి ప్రమీల ఖండించారు. మంగళవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘కులం పేరు చెప్పి నా కొడుకుకు దగ్గరైంది. క్రమంగా ఇంటికి రావడం మొదలు పెట్టింది. పగలు, రాత్రి తేడా లేకుండా ఫోన్లు చేసేది. పెళ్లి చేసుకోవాలంటూ అనేకసార్లు బ్లాక్ మెయిల్ చేసింది. ఆమె వేధింపులపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశాం’ అని ఎమ్మెల్యే తల్లి ప్రమీల చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఓ వివాహిత(బాధిత మహిళ) సంచలన ఆరోపణలు చేశారు. ఫేస్‌బుక్ సాయంతో కలిగిన పరిచయాన్ని అరవ శ్రీధర్ ఆసరాగా చేసుకుని.. తనను వాడుకుని మోసం చేశారని ఆరోపించారు. తన కోరిక తీర్చకుంటే తన కొడుకును చంపేస్తానని బెదరించారని.. కారులో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. తాను గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోమని బెదిరించారని.. అంగీకరించక పోయేసరికి పెళ్లి చేసుకుంటానని నమ్మించారని అన్నారు. తన భర్తకు కూడా ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించారని.. ఏడాదిన్నర కాలంలో ఐదుసార్లు అబార్షన్ చేయించారంటూ సంచలన ఆరోపణలు చేశారు.






