Bolisetti Satyanarayana: ఇక గాజు గ్లాసు గుర్తు జనసేనదే

by Gantepaka Srikanth |

జనసేన పార్టీ(Janasena)కి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనను ఈసీ చేర్చింది.

Bolisetti Satyanarayana: ఇక గాజు గ్లాసు గుర్తు జనసేనదే
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ(Janasena)కి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనను ఈసీ చేర్చింది. ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు(Janasena Glas)ను రిజర్వ్ చేసింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) మంగళవారం లేఖ రాసింది. తాజాగా.. ఈసీ గుర్తింపుపై జనసేన పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యానారాయణ(Bolisetti Satyanarayana) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు ‘ఇక గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీదే.. ఇది పవన్ కల్యాణ్‌తో పాటు జనసైనికులకు కష్టపడి సాధించిన విజయం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ వందకు వందశాతం విజయం సాధించింది. జనసేన అభ్యర్థులు పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించారు. 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్‌సభ స్థానాల్లో జెండా పాతారు.

Next Story