నేడు పవన్ అధ్యక్షతన జనసేన కీలక సమావేశం.. ‘పదవి-బాధ్యత’ పేరుతో పార్టీ నేతలకు దిశానిర్దేశం

by Kema Shiva Kumar |

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ‘పదవి-బాధ్యత’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

నేడు పవన్ అధ్యక్షతన జనసేన కీలక సమావేశం.. ‘పదవి-బాధ్యత’ పేరుతో పార్టీ నేతలకు దిశానిర్దేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ‘పదవి-బాధ్యత’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో NDA కూటమి ప్రభుత్వంలో జనసేన తరపున నామినేటెడ్ పదవులు పొందిన కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, నీటి సంఘాల అధ్యక్షులు సహా సుమారు 3 వేల మంది నాయకులు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. పారదర్శక పాలన, అవినీతి రహితంగా ప్రజల సేవ చేయాలని సూచించనున్నారు. గ్రాస్‌రూట్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని పిలుపునివ్వనున్నారు. పార్టీ బాధ్యతలు, కోడ్ ఆఫ్ కండక్ట్‌పై మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీలో రాజకీయ జవాబుదారీతనాన్ని పెంపొందించడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లక్ష్యంగా జరుగుతుంది జనసేనా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Next Story