మహిళా రిజర్వేషన్లకు జనసేన కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌

by Ramesh Naini |

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్వాగతించారు.

మహిళా రిజర్వేషన్లకు జనసేన కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్వాగతించారు. జనసేన పార్టీ మహిళా సాధికారతకు, రిజర్వేషన్లకు పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. 2019 ఎన్నికల్లోనే దీనిపై హామీ ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. సమర్థులైన మహిళలతోనే దృఢమైన కుటుంబాలు, తద్వారా బలమైన దేశ నిర్మాణం జరుగుతుందని పవన్ పేర్కొన్నారు. ఇదే తరుణంలో, ఫిడే మహిళల టోర్నీ విజేతగా నిలిచి, ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన ఆర్‌.వైశాలిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Next Story